ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణలేంటీ ?

భారత రక్షణ దళాల్లో విమానాలు, హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురికావడం ఆందోళనకరంగా మారింది. భారత తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బిపిన్‌ రావత్‌ సహా 13 మంది మృతి చెందారు.

సీడీఎస్‌ రావత్‌ బృందం ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ను సైనిక రవాణాకు వినియోగించే ఎంఐ-8 హెలికాప్టర్ల నుంచి అభివృద్ధి చేశారు. భారత్‌ మొత్తం 80 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు రష్యాకు చెందిన రోసోబోర్న్‌ ఎక్స్‌పోర్టుతో 2008లో ఒప్పందం చేసుకొంది.

2013 నాటికి డెలివరీలను పూర్తి చేసింది. మరో 71 హెలికాప్టర్లను వాయుసేన కోసం కొనుగోలు చేసేందుకు సంతకాలు జరిగాయి. అత్యంత సురక్షితమైందిగా పేరుండటంతో భారత్‌లోని వీఐపీల పర్యటనలకు దీనినే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం భారత ప్రధాని కూడా పర్యటనల కోసం దీనినే వినియోగిస్తున్నారు. ఈ హెలికాప్టర్‌కు ప్రత్యేకమైన రక్షణ కవచాలు అమర్చి ఉంటాయి. ఇంధన ట్యాంక్‌ నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు ఉన్నాయి అలాంటి విమానం ఎలా ప్రమాదానికి గురైంది ? అన్నది అంతుపట్టడం లేదు.