సమంత ఐటమ్ పోజు.. కేక !

ఐటమ్ ప్రియులకు, సమంత అభిమానులకు సడెన్ సప్రైజ్. ‘పుష్ప’ సినిమాలోని ఐటమ్ సాంగ్ లో సామ్ మెరవనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ.. సాంగ్ రిలీజ్ అప్ డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ నెల 10న రిలీజ్ చేస్తామని ప్రకటించింది. “ఊ అంటావా.. ఊ.. ఊ అంటావా ?.. ” క్యాచీ పదాలతో పుష్ప ఐటమ్ సాంగ్ మొదలు కానుంది. ఈ సందర్భంగా షేర్ చేసిన పిక్ లో.. బరువైన ఎద అందాలు, సన్నని నడుంతో సామ్ సవాల్ విసురుతోంది. సామ్ చిందులతో పుష్ప థియేటర్స్ లో రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

బన్నీ-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలు రాబోతున్న పుష్పపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. సమంత ఐటమ్ సామ్ లో మెరవనుంది. ఫాహిద్ ఫాజిల్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 17న పుష్ప పార్ట్-1 ప్రేక్షకుల ముందుకు రానుంది.