సునీల్ పాత్ర లీకు

బన్నీ-సుకుమార్ ల హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’ నుంచి సడెన్ సప్రైజ్ లు క్యూ కడుతున్నాయి. మొన్నటి వరకు పుష్ప ఐటమ్ భామ ఎవరన్నది ఎవ్వరికీ తెలీదు. సడెన్ సమంత అని ప్రకటించేసింది చిత్రబృందం. అంతేకాదు.. సామ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ లుక్స్ రిలీజ్ చేసి డబుల్ షాక్ ఇచ్చేసింది. ఆ తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఐటమ్ సాంగ్ ని రిలీజ్ చేసింది. అది రసిక రాజులను మత్తెక్కిస్తోంది. మరోవైపు సునీల్, అనసూయ పాత్రలు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి. 

తాజాగా సునీల్ నటనని చూసి.. బన్నీనే షాక్ తిన్నారట. చిత్తూరు యాసలో సునీల్ నటన స్టార్ విలన్ ని మించిపోయాడని కితాబిచ్చారట. ఇటీవల డబ్బింగ్ చెప్పడానికి వెళ్లిన అల్లు అర్జున్ , తనకంటే ముందుగానే సునీల్ డబ్బింగ్ చెప్పేసిన సీన్స్ ను చూశాడట. సునీల్ నటన మామూలుగా లేదు .. అదరగొట్టేశాడని సుకుమార్ తో చెప్పాడట. సునీల్ పాత్ర అంత బాగా వస్తుందనీ .. అంత బాగా చేస్తాడనని తాను ఎంతమాత్రం ఊహించలేదంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడట బ‌న్నీ.