మత్తెక్కిస్తున్న ఈ వాయిస్ ఎవరిది ?
‘పుష్ప’ సినిమాలోని ఐటమ్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ సమంత చిందేయనున్న సంగతి తెలిసిందే. ఊ.. అంటావా మావా ? ఊ.. ఊ.. అంటావా ? మామా అంటూ సాగే ఈ పాటను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం. చంద్రబోస్ రాసిన ఈ పాటను మత్తెక్కించేలా పాడింది ఎవరు ? అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అంత కసిగా, కమ్మగా పాడింది.. ఆ సింగర్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ? ఇంద్రావతి చౌహన్ తన మత్తు వాయిస్ తో నెక్స్ట్ లెవల్ కి చేర్చింది.
ఇంద్రావతి ఎవరో కాదు.. టాలీవుడ్ ఫేమస్ జానపద గాయని మంగ్లీకి స్వయానా చెల్లెలు. ఇప్పుడిప్పుడే ఇంద్రావతి టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది. ఈమె కూడా జానపద పాటలు పాడుతుంది. ఇంద్రావతి జార్జి రెడ్డి చిత్రంలో జాజి మొగులాలి అనే పాటని పాడింది. ఇక ఇదే పాటని కన్నడలో మంగ్లీ పాడడం విశేషం.