నిరుద్యోగులకు గుడ్ న్యూస్
బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిపోయిన విషయం ప్రభుత్వానికి తెలుసా..? అని లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
“పబ్లిక్‌సెక్టార్ బ్యాంకులకు కేటాయించిన 8,05,986 ఉద్యోగాల్లో కేవలం 41,177 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి’’ అని ఆమె వెల్లడించారు. మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్, క్లర్క్,సబ్‌స్టాఫ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎస్బీఐలో 8,544, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 6,743, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6,295, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 5,112, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4,848 ఉన్నట్లు తన సమాధానంలో నిర్మలా సీతారామన్ తెలిపారు.