రివర్స్ లో వచ్చి.. #MissUniverse2021 టైటిల్ కొట్టేసింది !

భారత అందం హర్నాజ్‌ కౌర్‌ సంధు విశ్వసుందరిగా నిలిచింది. పంజాబీ రాష్ట్రంలోని చండీగఢ్‌ ప్రాంతానికి చెందిన ఈ 21 ఏళ్ల చిన్నది.. 21 సంవత్సరాల తర్వాత భారత్‌కు విశ్వసుందరి కిరీటాన్ని తీసుకొచ్చింది. 80 దేశాలకు చెందిన అందగత్తెలను వెనక్కి నెట్టి విశ్వ వేదికపై విజయకేతనం ఎగురవేసింది. మోడలింగ్ నుంచి మిస్ యూనివర్స్ అక్కడి నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంటారు. రాణిస్తుంటారు ముద్దుగుమ్మలు. కానీ హర్నాజ్‌ కౌర్‌ మాత్రం రివర్స్.

హర్నాజ్‌ సంధుకు చిన్నతనం నుంచి మోడలింగ్‌ అంటే ఆసక్తి.  ఆ కలలను సాకారం చేసుకోవడానికి విద్యార్థి దశ నుంచే మోడలింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. మోడల్‌గా ఎన్నో వేదికలపై మెరిశారు. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని ‘లివా మిస్‌ దివా యూనివర్స్’ కిరీటాన్ని దక్కించుకున్నారు. హర్నాజ్‌ కేవలం మోడల్‌ మాత్రమే కాదు నటి కూడా. పంజాబీలో తెరకెక్కిన పలు సినిమాల్లో నటించారు. ఇప్పుడు మిస్ యూనివర్స్ గా నిలిచారు. ఇకపై బాలీవుడ్ నుంచి హర్నాజ్ కి ఆఫర్లు క్యూ కట్టనున్నాయి. 

Good to see #HarnaazSandhu
vouch for #climatecontrol. Hearty congrats to #MissUniverse2021#70thMissUniverse#MissUniverse
@HarnaazSandhu03 @HarnaazKaur pic.twitter.com/Zw4Z8TVnEQ— OTTRelease (@ott_release) December 13, 2021