పీవీ.. పాన్ ఇండియా బయోపిక్

పీవీ నరసింహారావు – భారతదేశ తొమ్మిదవ ప్రధాని. బహుముఖ ప్రజ్ఞాశాలి. బహుభాషావేత్త. ప్రధానిగా దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన ఆర్థిక వేత్త. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ముఖ చిత్రాన్ని మార్చివేశాయి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వంటి కాన్సెప్ట్స్ ప్రవేశపెట్టి.. దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించారు.

పీవీ జీవితంలో అనేక మలుపులు, మరపురాని విజయాలు ఉన్నాయి. వాటిని తెరమీదకు తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రకటన చేశారు. ‘ఆహా స్టూడియోస్’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రకటించిన అల్లు అరవింద్… పీవీ బయోపిక్ పై అధికారిక ప్రకటన చేశారు. ‘హాఫ్ లైన్’ (Half Lion)పేరుతో పీవీ జీవిత కథను సిరీస్ గా తెరకెక్కించనున్నారు.

తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ వెబ్ సిరీస్ ని తీసుకురానున్నారు. జాతీయ అవార్డు విజేత ప్రకాష్ ఝా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్లనుంది. పీవీ పాత్రలో ఎవరు కనిపిస్తారు ? మిగితా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

#ahaStudio‘s first of its four Pan India series- #HalfLion a biopic of Late Prime Minister #PVNarasimhaRao. https://t.co/9hjF1RCaoN@alluarjun @TrendsSSAA @vinay_sitapati @ApplauseSocial@AdityaBirlaGrp @nairsameer@deepaksegal @prasoon_garg #ottrelealse @ahavideoIN pic.twitter.com/aTR5mOvUM3— OTTRelease (@ott_release) December 13, 2021