రానా బర్త్ డే.. పవర్ ఫుల్ గిఫ్ట్

డిసెంబర్ నెల వచ్చిందంటే.. దగ్గుబాటి అభిమానులకు పండగే. విక్టరీ వెంకటేష్ (డిసెంబర్ 13), రానా దగ్గుబాటి (డిసెంబర్ 14) బర్త్ డేస్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయ్. అభిమానులకు బహుమతులు క్యూ కడతాయి. నిన్నంతా వెంకీ జపం జరిగింది. ఏ ఛానల్ చూసినా.. వెంకీ సినిమాలే. ఇక సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. వెంకీ బర్త్ డే యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ టాప్ లో కొనసాగాయి. ఇక ఈరోజు అబ్బాయ్ రానా బర్త్ డే సందర్భంగా.. అదే సందడి కొనసాగుతోంది.

ఇప్పటికే భీమ్లా నాయక్ నుంచి సరికొత్త పోస్టర్ వచ్చేసింది. అంతేకాదు.. ఈ సాయంత్రం స్పెషల్ అప్ డేట్ ఇవ్వబోతున్నారు. బహుశా.. రానా పాత్రపై స్పెషల్ టీజర్ రావొచ్చు. రానా నటిస్తున్న మరో చిత్రం విరాటపర్వం నుంచి గిఫ్ట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో రానా అభిమానుల సందడి మాములుగా లేదు. సినీ ప్రముఖులు ప్రభాస్, అనుష, చరణ్, మహేష్.. ప్రతి ఒక్కరు రానా విష్ చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈరోజంతా రానా నామ జపమే.
