ఈ ఏడాది.. టాప్-5 ఓటీటీ సినిమాలు/షోస్.. ఇవే

ఇప్పుడంతా ఓటీటీలదే హవా. థియేటర్స్ ను మించి ఓటీటీలోకి సినిమాలు, వెబ్ సిరీస్ లు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది (2021)లో ఓటీటీలో రిలీజైన టాప్-5 సినిమాలు, వెబ్ సిరీస్ ల విషయానికొస్తే.. టాప్-1లో #NETFLIX షో #LUPIN నిలిచింది. ఈ ఫ్రెంచ్ షో కావాల్సినంత వినోదాన్ని పంచింది. మరే.. సినిమా, షో టచ్ చేయని రేంజ్ లో లుపిన్ దూసుకుపోతుంది.

ఇక టాప్-2లో మన హిందీ చిత్రం సైలెన్స్ (#SILENCE) నిలవడం విశేషం. ఇదో మర్డర్ మిస్టరీ. #AbanBharuchaDeohans దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్. క్యాడిడ్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. జీ5లో రిలీజైంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ భాజిపేయి ఏసీపీ అవినాష్ వర్మ పాత్రలో జీవించేశారు. హై ఫ్రొఫైల్ మర్డర్ ఇన్విస్టిగేషన్ కథాంశంగా తెరకెక్కిన చిత్రమిది. ఓటీటీలో ప్రేక్షకులని ఎక్కువగా ఆకట్టుకున్న జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతోంది.


ఆ తర్వాత స్థానాల్లో నెటిఫ్లిక్స్ షో #THEHALFOFIT నిలిచింది. ఇదో కమింగ్ ఏజ్ షో. సెల్ఫ్ డిస్కవరీగా తెరకెక్కింది. ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకొని టాప్-3లో నిలిచింది.

ఇక #APPLETV+ లో విడుదలైన #ONTHEROCKS టాప్-4, నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన హిందీ చిత్రం #MARDKODARDNAHITHOTA టాప్-5లో నిలిచాయి. అయితే వీటిలో మనోజ్ బాయిపేయి సైలెన్స్ పైపైకి పాకుతూ.. టాప్ లోకి దూసుకెళ్తోంది. ఈ నెల చివరికల్లా సలెన్స్ టాప్-1లోకి దూసుకెళ్లిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.