RRR ప్రీమియర్.. టికెట్స్ వచ్చేసినయ్ !

ప్రపంచమంతా ఇప్పుడు తెలుగు సినిమా వైపు చూస్తోంది. #RRR సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళీ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రమిది. అజయ్ దేవగణ్, అలియాభట్, సముద్రఖనీ, శ్రియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

భారీ అంచనాల మధ్య జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అంతకంటే ఒకరోజు ముందే అంటే జనవరి 6నే అమెరికాలో ప్రీమియర్ షోస్ పడిపోనున్నాయి. దీనికి సంబంధించిన టికెట్స్ కూడా వచ్చేశాయి. ఈ చిత్రాన్ని యుఎస్ లో సరిగమ సినిమాస్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా అన్నీ బాషల్లో ప్రమోట్ చేస్తున్నారు. మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ సందర్భంగా సినిమా, పర్సనల్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నారు. రాజమౌళీ, చరణ్, తారక్ ల అల్లరి మాములుగా ఉండటం లేదు. తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరంభీమ్ ల మధ్య ఉన్న ఉమ్మడి పాయింట్ ఆధారంగా ఈ కథని రాసుకున్న జక్కన్న.. సినిమా విజయంపై ధీమాగా ఉన్నారు.

#RRRinUSA Premiers on Jan6th Grand Release by @sarigamacinemas.
@RaftarCreations @ssrajamouli@tarak9999 @AlwaysRamCharan@RRRMovie #RRR #OTTrelease#RRRMovie @aliaa08 pic.twitter.com/krWJokK3gR— OTTRelease (@ott_release) December 15, 2021