#Valimai మేకింగ్ వీడియో : అజిత్ అంకిత భావానికి ఫిదా కావాల్సిందే

కోలీవుడ్ స్టార్ అజిత్ తాజా చిత్రం ‘వాలిమై’. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టిన చిత్రబృందం మంగళవారం మేకింగ్ వీడియోని విడుదల చేసింది.

కొవిడ్‌కి ముందు, తర్వాత పరిస్థితిని చూపిస్తూ తీర్చిదిద్దిన ఈ మేకింగ్ వీడియో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అజిత్, కార్తికేయ పడిన శ్రమని ఇందులో చూడొచ్చు. ముఖ్యంగా అజిత్ బైక్ స్టంట్స్ అబ్బురపరిచాయి.

ఓ సందర్భంలో రైడ్ చేస్తూ.. అజిత్ జారిపడ్డారు. అయినా దాన్ని లెక్కచేయకుండా ముందుకుసాగారు. ఈ వయసులోనూ అజిత్ చేసిన స్టంట్స్ కి ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. జీ స్టూడియోస్, బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. హ్యుమా ఖురేషి కథానాయిక. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2022 సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.
#ValimaiMakingVideo OUT nowhttps://t.co/HQ8MSl1a0C #ValimaiMakingVideo #Valimai #ValimaiPromo #ValimaiTeaser #AjithKumar https://t.co/r1K2Re8OH4 pic.twitter.com/ooqn8nd74n— OTTRelease (@ott_release) December 14, 2021