పుష్ప ఐటమ్’కు వంద మిలియన్ వ్యూస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. కేవలం మూడ్రోజుల్లోనే రూ. 173కోట్లు కలెక్ట్ చేసింది. దేశంలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మరోవైపు పుష్ప ఐటమ్ సాంగ్ ఊ అంటావా మావా ? ఊ ఊ అంటావా మావా ? సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఐటమ్ నెంబర్ ఏకంగా వంద మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

పాట రిలీజైన మొదటి రోజు నుంచే వైరల్ అయింది. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మరింత ఊపొచ్చింది. మత్తెక్కించే ఇంద్రావతి వాయిస్. అంతకంటే మత్తెక్కించేలా ఉన్న సమంత గ్లామర్ స్టెప్స్ ఐటమ్ రేంజ్ ని మరింతగా పెంచాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఈ ఐటమ్ సాంగ్ నే వినిపిస్తున్నది. ఇక బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న పుష్ప టీమ్ రేపు తిరుపతిలో సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నది. 

#OoAntavaOoOoAntava 100million views @alluarjun @Samanthaprabhu2 #pushpa #PushpaTheRise pic.twitter.com/JiGadjEkTX— OTTRelease (@ott_release) December 20, 2021