DQ33 కోసం మూడు ప్రేమజంటలు

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (#DQ33) కొత్త చిత్రం ఫస్ట్ లుక్ కోసం అంతా రెడీ అయింది. రేపు ఉదయం 11 గంటలకు తెలుగు, తమిళ్, మలయాళ బాషల్లో ఒకేసారి ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు.

ఇందుకోసం ముగ్గురు ప్రేమజంటలను రంగంలోకి దింపారు. మలయాళంలో ఫాహిద్ ఫాజిల్-నజ్రియా నజీమ్, తమిళ్ ఫస్ట్ లుక్ ని సూర్య-జ్యోతిక, తెలుగు ఫస్ట్ లుక్ ని అక్కినేని నాగార్జున – అమల దంపతులు విడుదల చేయనున్నారు.

ఈ మూడు జంటలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు.. వీరంతా సినిమా రంగానికి చెందినవారు. కలిసి నటించి.. స్నేహం చేసి.. అది ప్రేమగా మారి.. పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిని ఎంచుకోవడం వెనక #DQ33 స్టోరీకి ఏమైనా సంబంధం ఉందా ? అనే చర్చ కొనసాగుతోంది.

ఇక బృందా గోపాల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. దుల్కర్ సల్మాన్ కి జంటగా కాజల్ అగర్వాల్, అతిథి హైదరి నటించనున్నారు. ‘కురుప్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దుల్కర్ నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.