హంసానందినికి క్యాన్సర్.. గ్రేడ్-3 !

మిర్చి భామకు క్యాన్సర్ హంసానందిని క్యాన్సర్ బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా హంసానే తెలిపింది. తనకు రొమ్ము క్యాన్సర్, గ్రేడ్-3 అని చెప్పిన హంసా.. త్వ‌ర‌లోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వ‌స్తానని ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా చెప్పింది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన హంసా తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. అయితే ఆమె నటిగా కంటే ఐటమ్ భామగా గుర్తింపు తెచ్చుకుంది.

అత్తారింటికి దారేది, మిర్చి, లెజెండ్, బెంగాల్ టైగర్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది.  ఇక సినిమా ఈవెంట్స్ లో హంసా స్పెషల్ ట్రీటు ఉండాల్సిందే. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లోనూ హంసా నటించింది. హంసాకు క్యాన్సర్ అని తెలిసి.. ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.