కాజల్.. కొత్త కొత్తగా !

చందమామ కాజల్ కొత్త స్టయిల్ లో స్టన్నింగ్ గా కనిపిస్తుంది. తాజాగా ఆమె లెటెస్ట్ ఫోటో షూట్ ఫోటోలు బయటికొచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ టైట్ ఫిట్ లో కనిపించే చందమామ..  ఈసారి స్టయిల్ మార్చింది. పట్యాల డ్రెస్.. పచ్చని బ్యాక్ గ్రౌండ్ లో మెరిసింది. వాటిని చూసిన నెటిజన్స్.. కాజల్ కొత్త కొత్తగా కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.


ఇక పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ హవా చూపిస్తుంది. ఆమె నటించిన ‘ఆచార్య’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవికి జంటగా ఆమె నటించిన రెండో సినిమా ఇది. చిరు రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెం. 150లో కాజల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

మరోవైపు మలయాళ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ 33వ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా ఎంపికైంది. ఇవీగాక .. వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నది.