ఇస్మార్ట్ స్టిల్

ఇస్మార్ట్ పోరీ నభా నటాషా సింగిల్ పిక్ తో రచ్చ చేస్తోంది. సినిమాలు లేనప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరించడం.. ఈ బ్యూటీ అలవాటు. ఇందులో భాగంగా తాజాగా ఓ స్టయిలీష్ లుక్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. జీన్ ప్యాంటు, వైట్ షర్ట్స్ తో.. కుర్చీలో స్టయిలీష్ గా కూర్చుని పోజు కొట్టింది. ఇప్పుడీ.. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఇస్మార్ట్ శంకర్ తో ఈ బ్యూటీ దశ మారినట్టే కనిపించింది. డిస్కోరాజాలో మాస్ మహారాజా రవితేజతో రొమాన్స్ చేసింది. ఆ తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ లో తేజుకి జంటగా నటించింది. అల్లుడు అదుర్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్, మేస్ట్రోలో నితిన్ తో జతకట్టింది. కానీ స్టార్ హీరోల నుంచి ఈ ముద్దుగుమ్మకు పిలుపులు రావడం లేదు. అందం ఓకే.. నటనపై ఇంకాస్త ఫోకస్ పెడితే.. ఈ బ్యూటీ జోరుపించే ఛాన్స్ ఉందేమో.. !