పాక్‌ పడవలో పట్టుబడిన ₹400కోట్ల డ్రగ్స్‌

భారీ మొత్తంలో డ్రగ్స్ తో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ ఫిషింగ్‌ బోటును గుజరాత్ తీరంలో అధికారులు పట్టుకున్నారు. రూ. 400 కోట్లు విలువ చేసే 77 కిలోల హెరాయిన్‌ని సీజ్‌ చేశారు. ఆ పడవలో ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.

ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ (ఐసీజీ), గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) సిబ్బంది నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌ లో ఈ భారీ ముఠా పట్టుబడింది. పాకిస్థాన్‌కు చెందిన హజీ హసన్‌, హజీ హసమ్‌ అనే ఇద్దరు స్మగ్లర్లు పంజాబ్‌లో అండర్‌ వరల్డ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు దీన్ని సరఫరా చేస్తున్నట్టుగా తెలిసిందని అధికారులు తెలిపారు.