పార్టీ ఇవ్వబోతున్న పుష్ప

బాక్సాఫీస్ దగ్గర పుష్పరాజ్ రచ్చ కొనసాగుతున్నది. సుకుమార్-బన్నీ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. పాన్ ఇండియా సినిమా ఈ నెల 17న పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది.

కేవలం రెండ్రోజుల్లోనే రూ. 173కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. బాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల బంపర్ కలెక్షన్స్ రాబడుతోంది. బాలీవుడ్ లో రెండ్రోజుల్లోనే రూ. 7కోట్లు వసూలు చేసింది. పుష్ప దెబ్బకు హాలీవుడ్ చిత్రం ‘స్పైడర్ మేన్ : నో వే హోమ్’ కలెక్షన్స్ పడిపోయాయి.. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

మూడ్రోజుల్లో కన్నడలో రూ. 17కోట్లు కలెక్ట్ చేసిందీ.. పుష్ప. ఈ నేపథ్యంలో పార్టీ లేదా పుష్ప ? అని అభిమానులు అడుగుతున్నారు. వారి కోరికను తీరిస్తూ.. రేపు (డిసెంబర్ 21) తిరుపతిలో సక్సెస్ పార్టీని ప్లాన్ చేసింది చిత్రబృందం. 

ఈ చిత్రంలో బన్నీకి  జంటగా రష్మిక మందన నటించింది. స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ లో మెరిసింది. మలయాళ నటుడు ఫాహిద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించారు. సునీల్, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీస్ నిర్మించింది.