అప్పుడు ఐష్.. ఇప్పుడు సాయి పల్లవి !

ఫిదా పోరీ సాయి పల్లవి ఐశ్వర్యరాయ్ ని గుర్తు చేస్తోంది. ఆమె తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. ఇందులో సాయి పల్లవి బెంగాలీ అమ్మాయిగా కనిపించనుంది. అంతేకాదు.. కాళీకాదేవి గెటప్ లో ఇప్పటికే విశ్వరూపం చూపించిన సంగతి తెలిసిందే. పాటలో అదరగొట్టింది. బెంగాలీ అమ్మాయిగా.. ఆ కట్టు, బొట్టుతో ఆకట్టుకుంటోంది.

గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బెంగాలీ అమ్మాయిగా కనిపించి మెప్పించిది… ఆ తర్వాత అంతే అద్భుతంగా బెంగాలీ సంస్కృతి-సాంప్రదాయాల్లో సాయి పల్లవి సూపర్ గా కనిపించిందని నెటిజన్స్ అంటున్నారు. ఐష్, సాయి పల్లవి బెంగాలీ గెటప్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. 

రాహుల్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ తెరకెక్కింది. నానికి జంటగా సాయి పల్లవి, కృతిశెట్టి నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. ఈ వారమే (డిసెంబర్ 24)న శ్యామ్ సింగ రాయ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విజయంపై చిత్రబృందం ధీమాగా ఉంది.