ఇది టీఆర్ఎస్ చావు డప్పు
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. యాసంగి ధాన్యం కొనమని కేంద్రం చెబుతుందని రాష్ట్రం అంటోంది. రాష్ట్రమే ధాన్యం ఇవ్వమని లేఖ ఇచ్చింది కేంద్రం చెబుతోంది. మెడపై కత్తిపెడితే.. ఆ లేఖ ఇవ్వాల్సి వచ్చిందని టీఆర్ఎస్ సర్కార్ చెబుతోంది. ఆ కత్తి ఏంటీ ? ఈడీ, ఐటీ దాడులేనా ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాటికి సమాధానం చెప్పని కెసీఆర్ సర్కార్ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నది.
తాజాగా ఇవాళ(సోమవారం) మరోసారి నిరసనలకు పిలుపునిచ్చింది. వరి ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని గ్రామాల్లో చావు డప్పుతో నిరసన తెలియజేయాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చింది. అదిష్టానం పిలుపుతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసనబాట పట్టారు. నిర్మల్ పట్టణంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. గులాబీ పార్టీ తన చావు డబ్బుని తానే కొట్టుకుంటుందని తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని స్పష్టం చేస్తున్నారు