విజయ్-రస్మిక.. ఇది అదేనా ?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందనల మద్య ఏదో సాగుతుంది అనే ప్రచారం చాన్నాళ్ల నుంచి ఉంది. వీరిద్దరు తొలిసారి ‘గీత గోవిందం’ కోసం జతకట్టారు. ఇద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. ప్రేక్షకుల ఫేవరేట్ పెయిర్ అనిపించుకున్నారు.
ఆ తర్వాత ‘డియర్ కామ్రెడ్’ కోసం మరోసారి కలిసి నటించింది.. ఈ జంట. ఇక అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం పెరిగింది. అది ప్రేమగా మారిందనే ప్రచారం ఉంది. గతంలో విజయ్ ఇంట్లో రస్మిక ప్రత్యేక్షమయింది. ముంబైలో ఈ జంట కెమెరాకు చిక్కింది. అయితే ఇటీవల రౌడీ ఎక్కడుంటే.. రస్మిక అక్కడ వాలిపోతుందట.
లైగర్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్న విజయ్ ను ఆదివారం రస్మిక కలిసింది. అతడితో కలిసి చక్కర్లు కొట్టింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విజయ్-రష్మి డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. అది పెళ్లి వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నారు.