ఆహా.. బాలయ్యతో బన్నీ !

నందమూరి బాలయ్య అనగానే  వెండితెర  ప్రేక్షకులకు తన పవర్పుల్ డైలాగ్సే మదిలో మెరుస్తుంటాయి. అయితే  ప్రస్తుతం బాలయ్య  . ప్రముఖ ఓటిటి సంస్థ అయిన “ఆహా”  బాలకృష్ణ తో “అన్ స్టాపబుల్ విత్ NBK” షో చేస్తున్నాడు.  

ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్స్లో మంచు మోహన్బాబు ఫ్యామిలీ, నాని, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, డైరెక్టర్ అనిల్ రావిపూడి, అఖండ చిత్రబృందం, రాజమౌళి, కీరవాణి పాల్గొన్నారు. 

తాజాగా అల్లు అర్జున్ ఈ షో కు హాజరుకాబోతున్నట్లు సమాచారం.  రీసెంట్ గా పుష్ప మూవీ తో బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ నెలకొలొప్తున్నాడు బన్నీ. ఇక ఇప్పుడు బాలయ్య తో కలిసి  ఎలాంటిది సందడి చేస్తాడో చూడాలి. తరువాత బాలయ్య  సూపర్స్టార్ మహేశ్బాబుతో  కూడా మరో ఎపిసోడ్ను  చేయబోతున్నాడని సినీ వర్గాల సమాచారం.