సంక్రాంతి రేసు నుంచి ‘భీమ్లా నాయక్’ అవుట్

పొంగల్ పోటీ నుంచి పవన్ కల్యాణ్ తప్పుకున్నారు. ఆయన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే పండగ రేసులో రెండు పాన్ ఇండియా సినిమాలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ ఉండటంతో.. భీమ్లా నాయక్ వాయిదా తప్పలేదు. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ రోజున రావాల్సిన ఎఫ్ 3 సినిమా ఏప్రిల్ కి వెళ్లింది.

పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా ‘భీమ్లానాయక్‌’ తెరకెక్కుతోంది. రానా దగ్గుబాటి మరో కథానాయకుడు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.  త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. రానాకు జోడీగా సంయుక్త మేనన్‌, పవన్‌కు జోడీగా నిత్యామేనన్‌ సందడి చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది.  

Official : #BheemlaNaayak postponed to Feb 25th, 2022.#RRR on Jan 7th #RadheShyam on Jan 14th.#BheemlaNayakOnFeb25th #Pawanakalyan @SVCCofficial #ottrelease pic.twitter.com/gfRW5GeYDj— OTTRelease (@ott_release) December 21, 2021