సంక్రాంతి నవ్వులు.. సమ్మర్ కు షిఫ్ట్
అసలు సిసలు సంక్రాంతి సినిమా అనిపించుకుంది ‘ఎఫ్2’. 2019 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఏకంగా రూ. 127కోట్లు కలెక్ట్ చేసింది. అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ నవ్వుల చిత్రం తెరకెక్కింది. వెంకటేష్-తమన్నా, వరుణ్ తేజ్ – మెహ్రీన్ జంటగా నటించారు.
ఇప్పుడీ నవ్వుల చిత్రానికి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 2022 సంక్రాంతి కానుకగా ఎఫ్ 3 ని విడుదల చేయాలని భావించారు. కానీ పోటీలో ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలు ఉండటంతో.. ఫిబ్రవరి 25కి వాయిదా వేశారు. ఇప్పుడీ.. డేటుని భీమ్లా నాయక్ ఆక్రమించేశాడు. దీంతో ఎఫ్ 3 ఏప్రిల్ 29కి వాయిదా పడింది. సంక్రాంతి నవ్వులు.. సమ్మర్ కి షిఫ్ట్ అయ్యాయి అన్నమాట.