ఆర్ఆర్ఆర్.. అద్భుత:

దర్శక ధీరుడు రాజమౌలి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటీంచిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్ ‘. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి పాత్రలో చరణ్ నటిస్తున్నారు. చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరుల మధ్య స్నేహాన్ని జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమా లో కళ్ళ కు కట్టినట్లు చూపిస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు ఇలా ఒకే ఫ్రెమ్ లో కనిపించడం అభిమానుల సంతోషం కు అవధులు లేవు.

గత కొద్ది రోజులు గా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‏లో జక్కన్నతోపాటు హీరోలు ఇద్దరు కూడా బిజిగా వున్నారు. కాగా, సినిమా పై ఆసక్తి పెంచెందుకు కొత్త ప్రయత్నాలను చేస్తున్నారు. తారక్ కొన్ని సన్నీవేశాలకు సంబంధించిన వీడియో లను విడుదల చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను  అలరించారు,  తాజాగా చరణ్ నటించిన అద్బుతమైన సన్నీవేశాల మేకోవర్ వీడియోలను విడుదల చేయడంతో ఫుల్ జోష్ లో వున్నారు మెగా ఫ్యాన్స్..  జనవరి 7 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రాజమౌలి సినిమా అంటే మొదటి నుంచి భారీ అంచనాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా పై కూడా అంతకు మించి అంచనాలు ఉన్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ ప్రచార చిత్రాలు అద్భుత: అన్నట్టు ఉన్నాయి.