భాలివుడ్ లో ఎన్టీఆర్‌..?

ఎన్టీఆర్‌-రామ్ చరణ్ కలిసి  నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.  ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, రేయ్‌ స్టీవ్‌సన్‌, ఎలిసన్‌ డ్యూడీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందించారు. ఈ పాన్‌ ఇండియా చిత్రం జనవరి 7న విడుదల కాబోతుంది

ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. హిందీ వెర్షన్‌ కోసం ఇటీవల ముంబయిలో ప్రి-రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించింది. ప్రచారంలో భాగంగా ఓ విలేకరి.. నేరుగా హిందీ సినిమాలో ఎప్పుడు నటిస్తారు? అని ప్రశ్నించగా.. తాను బాలీవుడ్‌ సినిమా అవకాశాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లువెల్లడించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం విడుదలైన తర్వాత పరిస్థితులు మారిఅవకాశాలు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.