#RocketBoys : రెజీనా ఫస్ట్ లుక్

యంగ్ హీరోయిన్ రెజీనాకు గుడ్ టైమ్ స్టార్ట్ అయినట్టుంది. బాలీవుడ్ లో రెండు బంపర్ ఆఫర్లు కొట్టేసింది. ఈ రెండు వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయి. వీటిలో ఒకటి సోనీ లైవ్ వెబ్ సిరీస్ రాకెట్ బాయ్స్ (RocketBoys).

ఇందులో ప్రముఖ క్లాసిక్ డ్యాన్సర్ మృణాళిని సారాభాయ్ పాత్రలో రెజీనా కనిపించనుంది. జిమ్ సర్భ్, ఇష్వాక్ సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు. అభయ్ పన్ను దర్శకత్వం వహించనున్నారు. తాజాగా మృణాళిని సారాభాయ్ పాత్రలో రెజీనా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ పాత్ర కోసం మృణాళిని సారాభాయ్ రిసెర్చ్ చేసినట్టు తెలిసింది.

ఇక అమెజాన్ ప్రైమ్ కోసం దర్శకుల ద్వయం రాజ్ & డీకే తీసుకొస్తున్న వెబ్ సిరీస్ లోనూ రెజీనా నటిస్తోంది. ఇందులో విజయ్ సేతుపతికి జంటగా కనిపించనుంది. టాలీవుడ్ లో ఏమాత్రం కలసిరాని తాప్సీ పన్ను.. బాలీవుడ్ లో హవా మొదలైంది.