సుకుమార్ స్పీచ్.. దర్శకులకు ఆదర్శం !

స‌హాయ ద‌ర్శ‌కుల‌కు దర్శకుడు సుకుమార్ ఇచ్చే విలువ వేరని.. ఇండ్ర‌స్ట్రీలో అంతా చెప్పుకుంటూ ఉంటారు. అదెలా ఉంటుందో.. మంగళవారం తిరుపతిలో జరిగిన ‘పుష్ప’ సక్సెస్ మీట్ లో తెలిసింది. పుష్ప విజ‌యోత్స‌వ స‌భ‌లో సుకుమార్ దాదాపు పావుగంట మాట్లాడాడు. ఈ స్సీచులో బ‌న్నీ గురించో, దేవి శ్రీ ప్ర‌సాద్ గురించో, త‌న గురించో, నిర్మాత‌ల గురించో కాదు. కేవ‌లం త‌న టీమ్ గురించి. త‌న స‌హాయ ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌ల బృందం గురించి మాత్రమే మాట్లాడారు.

వేదిక‌పై దాదాపు 15 మందిని తోడ్కుని వ‌చ్చిన సుకుమార్ – పేరు పేరునా.. ఒకొక్క‌రి గురించీ, వాళ్ల ప్ర‌తిభ గురించీ.. స‌వివ‌రంగా వివ‌రించి, త‌నకు వాళ్లెంత బ‌లాన్ని ఇచ్చారో పూస గుచ్చిన‌ట్టు చెప్పాడు. ఓ వైపు అభిమానులు బ‌న్నీ బ‌న్నీ అంటూ అరుస్తున్నా స‌రే.. నా టీమ్ గురించి నేను చెప్ప‌క‌పోతే ఎవ‌రు చెబుతారు? వాళ్లే నా బ‌లం.. వాళ్లు లేక‌పోతే నేను లేను అంటూ… పేరు పేరునా.. ఒకొక్క‌రినీ ప్ర‌స్తావిస్తూ వాళ్ల గురించి అన‌ర్గ‌ళంగా మాట్లాడాడు. త‌న‌కు వాళ్లెంత చేశారో చెప్పుకొచ్చాడు. బహుశా.. సుక్కు సక్సెస్ సీక్రెట్ ఇదేనేమో.. !