వెలుగులోకి థియేటర్స్ అరాచకాలు
ఏపీలో టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం కొత్త జీవో తెచ్చింది. దీనిపైన ఎగ్జిబిటర్లు అంత త్వరగా కోర్టుకు వెళ్లలేదు. థియేటర్ల గుట్టు ప్రభుత్వం దగ్గర వుండడమే కారణం. చాలా థియేటర్లు నిబంధనల మేరకు నడవడం లేదు. కానీ ఏళ్లకు ఏళ్లుగా అధికారులు ఈ అరాచకాన్ని చూసీ చూడనట్లు వదిలేసారు.
లైసెన్స్ లు రెన్యువల్ లేకపోయినా, సేఫ్టీ వ్యవహారాలు సరిగ్గా లేకపోయినా, ఆ లైసెన్స్ ఫీజులు కట్టకపోయినా, ఇలా చాలా విషయాలను గాలికి వదిలేసారు. అయితే ఇప్పుడు మొత్తం వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది.
పాత రేట్లు అమలు చేసుకునే అవకాశం వచ్చింది. అయినా కూడా చాలా మంది కోర్టు ఆదేశాలు వున్నా కూడా అమలు చేయడం లేదు. అమలు చేస్తామని జాయింట్ కలెక్టర్లకు దరఖాస్తు చేయడం లేదు. కొంతమంది అలా చేస్తే ముందుగా అధికారులు థియేటర్ రికార్డులు అడుగుతున్నారని తెలుస్తోంది.అందుకే థియేటర్స్ అరాచకాలను బయటికి రాకుండా జాగ్రత్తపడుతున్నారట.