విక్రమ్ యాక్షన్

ఖైదీ, మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం ‘విక్రమ్’. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫాహిద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది.

ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా కమల్ తో దిగిన ఓ ఫోటోను అభిమానులను షేర్ చేసుకున్నారు దర్శకుడు లోకేష్. ఇప్పుడీ.. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి రవీచంద్రన్ అశ్విన్ సంగీతం అందిస్తున్నారు. కమల్ హాసన్. ఆర్. రవీందన్ నిర్మాతలు.

‘ఖైదీ’తో ఆకట్టుకున్న కనకరాజు మాస్టర్ తో నిరాశపరిచారు. ఆయన మూడో సినిమాగా వస్తున్న విక్రమ్ తో మెప్పించాలని ఆశపడుతున్నారు. మరోవైపు కమల్ తన నటనతో అభిమానులకు షాక్ ఇచ్చి చాన్నాళ్లయింది. విక్రమ్ తో ఈ సారి గట్టి షాక్, సప్రైజ్ ఇవ్వాలని భావిస్తున్నారు.