బంగార్రాజుకు ఆఖరి షూట్.. కృతికి ఫస్ట్ షాట్ !
సోగ్గాడే చిన్ని నాయన – నాగార్జున, ఆయన అభిమానులకు బాగా నచ్చిన సినిమా. కల్యాణ కృష్ణ దర్శకత్వంలో 2016 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలోని బంగార్రాజు పాత్ర అంటే నాగ్ కి భలే ఇష్టం. ఈ పాత్రనే ప్రధాన ఇతివృత్తంగా ఓ సినిమా చేయాలని నాగ్ ఆశ. అతి బాగా లేటైయినా.. ఇప్పటికీ జరిగింది. బంగార్రాజు షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఇందులో నాగ చైతన్య కూడా నటిస్తున్నారు.
ఈరోజే ఆఖరి రోజు షూటింగ్ అంటూ.. ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఐటమ్ నెంబర్ కి సంబంధించిన పోస్టర్ అది. దీనిపై స్పందించిన హీరోయిన్ కృతి శెట్టి.. సినిమాలో ఇదే నా ఫస్ట్ సాంగ్ షాట్ అంటూ కామెంట్ చేసింది. ఇక సంక్రాంతి రేసు నుంచి భీమ్లా నాయక్ తప్పుకోవడంతో.. ఆ డేటుకు రావాలని బంగార్రాజు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరీ.. ప్రొడ్యూసర్ గిల్డ్ అందుకు అనుమతి ఇస్తుందా ? అన్నది చూడాలి.