ధనుష్ తెలుగు సినిమా టైటిల్ ‘సార్’

కోలీవుడ్ స్టార్ ధనుష్ సడెన్ సప్రైజ్ ఇచ్చారు. ఆయన తెలుగు సినిమా మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. ‘సార్’ టైటిల్ పెట్టారు. తెలుగు, తమిళ బాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. పిడివి ప్రసాద్ సమర్పణలో సీతార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. జీవీ ప్రకాష్ సంగీతం అందించనున్నారు. హీరోయిన్ ఎవరు ? ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. 

వాస్తవానికి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల చేయాల్సిన సినిమా ఇది. ప్రస్తుతం ధనుష్ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నానని ధనుష్ కూడా చెబుతూ వచ్చారు.

అయితే ఇప్పుడీ.. ఈ సినిమా క్యాన్సిల్ అయిందా ? లేక స్క్రిప్ట్ పనుల కోసం చాలా టైమ్ తీసుకొనే శేఖర్ కమ్ముల.. ఇంకా పూర్తి స్కిప్ట్ పూర్తి చేయలేదా ? ఈ లోపు ధనుష్ వెంకీ అట్లూరి సినిమాని పూర్తి చేసి.. ఆయన దగ్గరకు వెళ్లనున్నారా ? అన్నది తెలియాల్సి ఉంది. ఇక ధనుష్ నటించిన బాలీవుడ్ చిత్రం #AtrangiRe ఈ వారమే ప్రేక్షకుల ముందుకురానుంది.

#Dhanush’s Tamil, Telugu Bilingual Film Title as #Vaathi / #Sir Poster 🤩🔥#GVPrakash Musical !! 💥
Congratulations @dhanushkraja Sir.. ❤️ #AtrangiRe #SaraAliKhan #AtrangiReFromDec24HotStar #Dhanushfans #SirMovie #Title pic.twitter.com/jmeFmM7GDl— OTTRelease (@ott_release) December 23, 2021