ఎక్స్ ట్రా ‘ఆర్’ (RRRR).. అదిరింది !

రాజమౌళి-రామ్ చరణ్-ఎన్టీఆర్ కలిస్తే ట్రిపుల్ ఆర్ (#RRR) అయింది. ఈ భారీ మల్టీస్టారర్ సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే ఒకరోజు ముందే అంటే.. జనవరి 6న అమెరికాలో ప్రీమియర్ షోస్ పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ప్రస్తుతం ముంబైలో రాజమౌళి ఉంది. అక్కడ వరుస ఈవెంట్స్, ప్రెస్ మీట్ లలో సందడి చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాలీవుడ్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. 

అయితే బుధవారం ఆర్ ఆర్ ఆర్ కు ఎక్స్ ట్రా ఆర్ జతకలిసింది. అతడే రానా దగ్గుబాటి. రాజమౌళి-రామ్ చరణ్-ఎన్టీఆర్ కలిసి రానా ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొమరం భీమ్, అల్లూరిలతో భల్లాల దేవుడు జతకలిశాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక సంక్రాంతి రేసులో ఆర్ ఆర్ ఆర్ తో పాటు మరో పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్,అల్లూరి సీతారామరాజుల జీవితాల్లోని ఓ ఉమ్మడి పాయింట్ ఆధారంగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కథను రాసుకున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ కు అనూహ్యమైన స్పందన వస్తుంది. బాహుబలి అంతకుమించిన విజయం ఆర్ ఆర్ ఆర్ సాధిస్తుందని చిత్రబృందం ధీమాగా ఉంది. ఈ చిత్రంలో అల్లూరిగా చరణ్, ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించారు. ఇక కొమరంభీమ్ గా తారక్, ఆయనకు జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటించింది. ఎం. ఎం కీరవాణి సంగీతం అందించారు. డివివి దానయ్య నిర్మాత. 

#PicOfTheDay #RRRMovie #SSRajamouli #NTR #RamCharan #RanaDaggubati pic.twitter.com/VXYuSYHJpN— OTTRelease (@ott_release) December 22, 2021