ఇంకా అదే పనిలో కరీనా

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్ లో ఉన్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ ఓ పోస్ట్ పెట్టింది.

“మనం కోవిడ్ సమయంలో ఉన్నామా ? లేదా ? అని తెలుసుకోవడానికి నేను ఇంకా ప్రయత్నిస్తున్నాను. ఎలాగైనా 12వ రోజుకు రెండు రోజులు మిగిలి ఉన్నాయి. అందరూ సురక్షితంగా ఉండండి” అని రాసుకొచ్చింది. కరీనా కపూర్ ఖాన్‌కు గత వారం కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది . అప్పటి నుండి ఆమె క్వారంటైన్ లోనే ఉంటుంది. కరోనా రావడం వలన ఆమె తన కొడుకు తైమూరు పుట్టినరోజు వేడుకలను కూడా జరుపలేకపోయింది.