క్షుద్ర పూజలు చేసిన రష్మిక మందన ?

రష్మిక మందన ప్రస్తుతం ఇండియన్ క్రష్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆమె రీసెంట్ రిలీజ్ పుష్ప (Pushpa)రికార్డ్ వసూళ్లు రాబడుతుంది. తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా పుష్ప చెప్పుకోదగ్గ కలెక్షన్స్ దక్కించుకుంటుంది. తన కెరీర్ లో మరొక బ్లాక్ బస్టర్ గా పుష్ప నిలిచింది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించిన రష్మిక ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. వరుస ఆఫర్ లతో తన ఖాతా నింపుకుంటుంది. ప్రస్తుతం భాలివుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.అయితే ఈ సక్సెస్ కి కారణం ఆమె హార్డ్ వర్క్, గ్లామర్, టాలెంట్ అని చెప్పాలి.

సినీ పరిశ్రమలో జనాలకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. అలాగే పూజలు, తాయత్తుల మహిమలు, జాతకాలు బాగా నమ్ముతారు. ఈ లిస్ట్ లో రష్మిక కూడా ఉన్నారు.ఆమె పూజలు చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆమె చేత పూజలు నిర్వహిస్తుంది వేణు స్వామి కావడంతో ఆయన సినీ పరిశ్రమలో పలువురి గురించి ఆయన చెప్పినవి నిజం కాగా, మరి రష్మిక ఎందుకు పూజలు చేస్తుందోనని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు . ఈ పూజలకు సంబందించిన వీడియేలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.