ప్రధానితో ఉపాసన.. ఇది నిజం కాదు !
మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన దుబాయ్ 2020 ఎక్స్పోను సందర్శించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీతో భేటీ అయిన విశేషాలను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీని దుబాయ్ 2020 ఎక్స్పో వద్ద భేటీ అవ్వడం ఎంతో గౌరవప్రదంగా ఉందని పేర్కొన్నారు.
ఎన్నో రకాల కొత్త ఆవిష్కరణలు, ఆరోగ్య పరిరక్ష, మహిళా సాధికారత, సంస్కృతి పరిరక్షణ మీద ప్రధానంగా దృష్టి సారించడం అనేవి అద్భుతమైన అంశాలు. అలాగే సాంకేతిక శక్తి మనకు ఎన్నో అవకాశాన్ని ఇస్తుంది. మనం దానిని తెలివిగా ఉపయోగించుకోవాలి. చంద్రుని మీద దక్షిణ ధృవంపై నీరు ఉందా? లేదా? అని తెలుసుకునేందుకు ఇండియానే మొట్టమొదటి సారిగా చంద్రయాన్ ప్రయోగం చేసిందని మీకు తెలుసా? ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు ఈ ఎక్స్పో కార్యక్రమంలో ఉన్నాయి. మీ పిల్లలను ఈ ఎక్స్ పోకు తీసుకెళ్లాలని కోరుతూ ఉపాసన ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టారు.
అంతేకాదు.. ప్రధానితో తాను భేటీ అయిన విషయం కూడా నిజం కాదు. అగ్మెంటెడ్ రియాలిటీ అనే టెక్నాలజీ ద్వారా ఈ ఫోటోను సృష్టించారు. ఈ టెక్నాలజీ ఉపయోగించి దుబాయ్ 2020 ఎక్స్పోలో భారత పార్లమెంట్, ప్రధాని మోదీ ఉన్నట్లు ఆవిష్కరించి ఇలా షేర్ చేశారని చెప్పారు.
A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)