గోపిచంద్ హ్యాట్రిక్ కాంబో.. క్లాప్ పడింది !

యాక్షన్ హీరో గోపీచంద్ కు అచ్చొచ్చిన దర్శకుడు శ్రీవాస్. వీరి కాంబోలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు.. వీరి కాంబోలో హ్యాట్రిక్ చిత్రానికి క్లాప్ పడింది. గోపీచంద్ 30వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ కథపై శ్రీవాస్ చాలారోజుల పాటు కూర్చున్నారు. ఓ మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని స్క్రిప్ట్ ని రెడీ చేశారు. గోపీచంద్ కూడా సింగిల్ సిట్టింగ్ లోనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ధీమాతో ఉన్నారు.

 ఈ ఏడాది సీటీమార్ తో విజయాన్ని అందుకున్నాడు గోపీ. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. అది పూర్తవ్వగానే శ్రీవాస్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.