కాజల్ ప్రెగ్నెంట్.. ఇదిగో రుజువు !

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తల్లికాబోతుంది అంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. బేబీ బంప్ తో ఉన్న కాజల్ ఫోటోలను నెటిజన్స్ వైరల్ చేశారు. అయితే దీనిని కొందరు అభిమానులు ఖండించారు.

అదంతా కెమెరా జిమ్మిక్కు అని కొట్టిపారేశారు. కాజల్ నుంచి క్లారిటీ రాకపోవడంతో.. ఆమె ప్రెగ్నెన్సీ ఓ ప్రచార స్టంట్ గానే భావిస్తున్నారు. వాళ్లందరికీ ఇప్పుడు కాజల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాజాగా బ్లాక్ డ్రెస్  లో దిగిన ఓ సెల్ఫీ పిక్ ని కాజల్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో తన ఎడమచేతిని తన పొట్టమీద పెట్టుకొని.. బేబీ బంప్ అన్నట్టుగా చూపిస్తుంది. ఈ పిక్ ను చూసిన నెటిజన్స్ కి ఆమె గర్భవతీ అనే స్పష్టత వచ్చినట్టయింది.

కొరటాలశివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమాలో కాజల్ కథానాయికగా నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్నఆచార్య రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ 33వ చిత్రం హే సైనామికా చిత్రంలోనూ కాజల్ హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 25న హే సైనామికా ప్రేక్షకుల ముందుకు రానుంది.