RevoltofBHEEM : కొమురం భీముడో.. రోమాలు నిక్కబొడిచేలా.. !

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ప్రచార చిత్రాలు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం #RevoltofBHEEM పేరిట కొమురం భీమ్ కు సంబందించిన పాటను విడుదల చేశారు.

శుద్దాల అశోక్ తేజ్ రాసిన ఈ పాటను.. కీరవాణి తనయుడు కల భైరవ ఆలపించారు. ఎన్టీఆర్ వాయిస్ మొదలైన ఈ పాటను వింటుంటే.. రోమాలు నిక్కబొడుస్తున్నాయి.
తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల జీవితాల్లోని ఉమ్మడి పాయింట్ ఆధారంగా ఈ సినిమాని తీసుకొస్తున్నారు జక్కన్న.

అల్లూరిగా రామ్ చరణ్, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ఇక కొమరంభీమ్ పాత్రలో ఎన్ టీఆర్, ఆయనకి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం కీరవాణీ. డివివి నిర్మాత.

#KomuramBheemudo 🔥🔥🔥

👉https://t.co/jtbb1khEMe#RevoltOfBHEEM @tarak9999
@AlwaysRamCharan #RRRMovie @RRRMovie @DVVMovies@LahariMusic @TSeries@MMKeeravaani @kaalabhairava7 #ottrelease pic.twitter.com/gQa3DVizWx— OTTRelease (@ott_release) December 24, 2021