గని కొత్త రిలీజ్ డేట్.

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్, బాలీవుడ్ భామ  సయీ మంజ్రేకర్ జంటగా నటించిన చిత్రం ‘గ‌ని’. కిరణ్ కుమార్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధు ముద్ద – అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతాన్నిఅందించగా,  సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర, నదియా, జగపతి బాబు, త‌మన్నా భాటియా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 24న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిర్మాత‌లు వెల్ల‌డించారు. అయితే ‘గని’ రిలీజ్ అనుకున్న రోజు నాని నటించిన  ‘శ్యామ్ సింగ రాయ్’ వస్తుండటంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. తాజాగా మార్చి 18న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ఓ కొత్త పోస్ట‌ర్ ద్వారా చిత్ర బృందం తెలియ‌జేసింది. ఈ చిత్రం  బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కగా  హీరో  వరుణ్ తేజ్ బాక్సర్ గా కన్పించనున్నాడు.