సామ్ తో తారక్ రొమాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరన్ కలిసి నటించిన చిత్రం  ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. అయితే  ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ స్టార్ హీరోలు చేయబోయే సినిమాలపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారని సినీ వర్గాల సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్, కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటనతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఎన్టీఆర్ సరసన  బాలీవుడ్ భామలు అలియా భట్, కియారా అద్వానీ, జాన్వీ కపూర్ల పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ కథలో హీరోయిన్ పాత్ర బలంగా ఉంటుందని.. సామ్ అయితే ఆ పాత్రను క్యారీ చేయగలడని దర్శకుడు కొరటాల బలంగా నమ్ముతున్నాడట. అయితే చైతూతో తన డైవర్స్ తర్వాత అటు బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు గ్రాండ్ ప్లాన్ చేసుకున్న సమంతాను ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం లాక్ చేసినట్లుగా సమాచారం.ఎన్టీఆర్ సమంతా  కలిసి  ఇప్పటికేతో బృందావనం, రామయ్య వస్తావయ్యా, రభస, జనతా గ్యారేజ్ సినిమాలలో నటించగా,  ఇప్పుడిది  ఐదవ సినిమా అవుతుంది. సమంతను ఫైనల్ చేయడం నిజమైతే.. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.