డేంజర్ బెల్స్ : 8 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్

దేశంలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ విజృంభణ ప్రారంభం అయింది. సోమవారం ఒక్కరోజే 135 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా గోవాలో 8 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్దారణ అయింది. డిసెంబర్ 17న బాలుడి కుటుంబం యూకే నుంచి వచ్చింది. యూకే ఎయిర్ పోర్టులో నిర్వహించిన టెస్టుల్లో బాలుడికి నెగటివ్ నిర్దారణ అయింది. దీంతో కుటుంబంతో కలిసి ఇండియాకు వచ్చాడు. ఇక్కడి ఎయిర్ పోర్టులో నిర్వహించిన టెస్టుల్లో బాలుడికి కరోనా.. అది కూడా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ అని తేలింది.

ప్రస్తుతం బాలుడికి చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో ఆ బాలుడి ప్రైమరీ కాంటాక్ట్‌లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గోవాలో ఇదే మొదటి ఒమిక్రాన్‌ కేసు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య సిబ్బందిని అలెర్ట్ చేసింది. చిన్న పిల్లల్లో ఒమిక్రాన్ ప్రభావం అధికంగా ఉంటుందనే వార్తలు వినిపించాయి. మరోవైపు ఒమిక్రాన్ డేంజర్ ఏమీ కాదు.. వేగంగా వ్యాపిస్తుంది. కానీ ఈజీగా తగ్గిపోతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.