సింగర్ మంగ్లీకి సెల్ఫీల సెగ
తెలంగాణ సింగర్ మంగ్లీకి ఏపీలో చేధు అనుభవం ఎదురైంది. ఫోక్ సాంగ్స్ సింగర్ గా పాపులర్ అయిన మంగ్లీ.. ఆ తర్వాత సినిమా అవకాశాలను అందుకుంది. ఈ క్రమంలో సెలబ్రెటీ అయింది. ఓ వైపు పాటలు, మరోవైపు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, స్పెషల్ గెస్ట్ గా వెలుతూ బిజీ బిజీగా గడుపుతున్నది.
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు మంగ్లీ స్పెషల్ గెస్ట్ గా వెళ్లింది. అయితే అక్కడ ఆమెను అభిమానులు చుట్టుముట్టారు. సెల్ఫీలు దిగాలను పట్టుబట్టారు. వారి తాకిడిని తట్టుకోలేక.. అటు.. ఇటు పరుగెత్తిన మంగ్లీ… చివరికి వారిపై ఫైర్ అయింది. ఓ దరిద్రుడా… ఫోన్ పగలగొట్టు అంటూ ఫ్యాన్ పై మంగ్లీ ఉగ్రరూపం చూపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అదే సమయంలో ఏపీ మంత్రి కూతురు పెళ్లికి ముఖ్య అతిథిగా వెళ్లే రేంజ్ కు మంగ్లీ ఎలా ఎదిగింది ? అనే చర్చ కూడా మొదలైంది. ఇక పుష్ప ఐటమ్ సాంగ్ కన్నడ వర్షన్ ను మంగ్లీ పాడగా.. ఇదే పాటను తెలుగులో ఆమె చెల్లెలు ఇంద్రావతి పాడిన సంగతి తెలిసిందే. మత్తెక్కించే గొంతుతో కుర్రాళ్లను పిచ్చెక్కించేశారు అక్కా-చెల్లెలు.
#SingerMangli has once again made headlines, she serious on people, who surrounded her for take selfies at a function. She Fires on her asst., #Mangli#Prakasham #AndhraPradesh pic.twitter.com/UmfTA08nAC— Surya Reddy (@jsuryareddy67) December 27, 2021