అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఫిక్స్

కరోనా మహమ్మారి తర్వాత సినిమా పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కోలుకుంటునాయి. అయితే కరోనా తరువాత రీలిజ్ అయిన బోయపాటి దర్శకత్వంలో బాలక్రిష్ణ హీరోగా నటించిన చిత్రం ‘అఖండ’ సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా అఖండ నిలిచింది. ప్యాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘పుష్ప’ కూడా భారీ విజయాన్ని అందుకుంది. మరోవైపు శ్యాం సింగరాయ్ సినిమా కూడా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది.

ఈ నేపద్యంలో ఓటీటీల్లో సందడి చేయడానికి భారీ చిత్రాలు సిద్ధమవుతున్నాయి.సంక్రాంతి కానుకగా అఖండ, పుష్ప, శ్యాంసింగరాయ్ సినిమాలు జనవరిలో ఓటీటీల్లోకి రానున్నాయి.. రిలీజ్ డేట్స్ కూడా దాదాపు ఫిక్స్ అయ్యాయి.

బాలయ్య అఖండ మూవీ జనవరి మొదటివారంలో కానీ సంక్రాంతి రోజు కానీ హాట్ స్టార్ లో రానుంది. పుష్ప మూవీ అమెజాన్ లో సంక్రాంతికి రానుంది. నాని నటించిన శ్యాం సింగరాయ్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో జనవరి చివరి వారంలో సందడి చేయబోతున్నాయి. దీంతో సంక్రాంతి పండగకు సినిమాల పండగ రాబోతోంది.