లాలా భీమ్లా డీజే వర్షన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ అనే సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. భీమ్లా నాయక్’ మూవీ నుంచి ఇప్పటి వరకూ నాలుగు పాటలు విడుదలయ్యాయి. అవన్నీ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ‘లాలా భీమ్లా’ అంటూ సాగే పాట డీజే వెర్షన్‌ను విడుదల చేయబోతున్నారు. దీన్ని డిసెంబర్ 31, సాయంత్రం 7:02 గంటలకు వదులుతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు దగ్గుబాటి రానా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు కీలక పాత్రలను పోషిస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.