RRR వాయిదా.. రాజమౌళి క్లారిటీ !

RRR కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అంతకంటే ఒకరోజు ముందే అంటే.. జనవరి 6నే యుఎస్ లో ప్రీమియర్ షోస్ పడనున్నాయి. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృభిస్తున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ వాయిదా పడనుందనే ప్రచారం జరుగుతోంది. దాదాపు 100కుపైగా దేశాల్లో ఒమిక్రాన్ వ్యాపించింది. ప్రపంచం మళ్లీ ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నది. మన దేశంలో అదే పరిస్థితి.

ఒమిక్రాన్ విజృంభణతో రాష్టాలు ఆంక్షలు విధిస్తున్నాయి. నైట్ కర్ఫ్యూలు, థియేటర్స్ మూసివేతకు రెడీ అవుతున్నాయి. ఇప్ప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. మహారాష్ట్ర, కర్నాటక.. తదితర రాష్ట్రాలు కరోనా ఆంక్షలను విధించాయి. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ మరోసారి వాయిదా పడటం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని దర్శకుడు రాజమౌళి ఇచ్చినట్టు తెలిసింది. ప్రముఖ సినీ జర్నలిస్ట్ తరణ్ ఆదర్శ్ కేరళలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని కలిశారు. ఈ సందర్భంగా సినిమా వాయిదాపై ఆయన జక్కన్నని అడగడం జరిగింది. ఎట్టిపరిస్థితుల్లో సినిమాని వాయిదా వేయమని జక్కన్న క్లారిటీ ఇచ్చినట్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.