తెలంగాణలో 67కి చేరిన ఒమిక్రాన్ కేసులు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు తెలంగాణలో క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో 5 కొత్త కేసులు వెలుగులోనికి వచ్చాయి. గురువారం హైదరాబాద్ విమానాశ్రాయనికి విదేశాల నుంచి 143 మంది చేరుకున్నారు. వారికి కరోనా టెస్టులు చేశారు. పాజిటివ్ గా నిర్థారణ అయినవారి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కి పంపారు. ఈ ఫలితాల్లో ఐదుగురికి ఒమిక్రాన్ ఉన్నట్టు తెలిసింది. దీంతో.. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 280 కరోనా కేసులు నమోదయాయి. ఒక్కరు కరోనాతో మృతి చెందారు. 

మరోవైపు ప్రస్తుతం కేసుల పెరుగుదల థర్డ్‌వేవ్‌కు సంకేతమన్నారు. డెల్టా వేరియంట్‌ కంటే 30 రెట్ల వేగంతో ఒమిక్రాన్‌ వ్యాప్తి ఉందని తెలంగాణ ప్రజారోగ్యశాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు తెలిపారు. ఒమిక్రాన్‌ సోకిన వారిలో 90 శాతం మందికి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని డీహెచ్‌ అన్నారు. లక్షణాలు కనిపించినవారు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని.. సంక్రాంతి తర్వాత థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశముందని డీహెచ్ తెలిపారు.