OTTలోకి ‘ఆర్ఆర్ఆర్’, రాధేశ్యామ్.. సడెన్ సప్రైజ్ తప్పదా ?

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సునామీ వ్యాపిస్తోంది. ఇప్పటికే 130 దేశాలకు పాకింది. మన దేశంలోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1000కి చేరువయ్యాయి. ఒమిక్రాన్ ప్రభావం అధికంగా  ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, కేరళ, తెలంగాణ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి కరోనా కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. దీంతో అక్కడ థియేటర్స్ పూర్తిగా మూతపడ్డాయి. మహారాష్ట్రలో విధించిన ఆంక్షలతో అక్కడ 50శాతం ఆక్యుపెన్సీతోనే సినిమా హాళ్లు నడుస్తున్నాయి. మిగితా రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు తీసుకోవాలి. థియేటర్స్, బార్లు, కబ్ లు మూసేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది. ఈ మేరకు న్యాయ స్థానాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఈ ప్రభావం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న పాన్ ఇండియా సినిమాలు ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ పై పడనుంది. 

మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ విడుదలను వాయిదా వేసే ప్రసక్తే లేదని దర్శకుడు రాజామౌళీ చెబుతున్నారు. రాధేశ్యామ్ చిత్రబృందానికి ఇదే మాట. అయితే రోజురోజుకి ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మరో వారం, రెండో వారాల్లో దేశ వ్యాప్తంగా థియేటర్స్ మూతపడే అవకాశాలు లేకపోలేదు. బయటి దేశాల్లో ఇప్పటికే ఆంక్షలు అమలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి వస్తున్న రెండు పాన్ ఇండియా సినిమాలకు ప్లాన్-బి ఉంది. అదే ఓటీటీ రిలీజ్ అని చెబుతున్నారు.