అందుకే #RRR వాయిదా

ఊహించినదే జరిగింది. దేశంలో కరోనా, దేశంలో కరోనా, ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరుగుతోన్న నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాటుగా సంక్రాంతి సినిమాలు రాధేశ్యామ్, వాలిమై వాయిదా పడతాయనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ వాయిదాపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది.

దేశంలో ఒమిక్రాన్‌ తీవ్రత పెరుగుతుండటంతో ఇప్పటికే దిల్లీలో థియేటర్లు మూతపడ్డాయి. ముంబయిలో సినిమాహాళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. మరోవైపు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఒమిక్రాన్ కట్టడి కోసం కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో థియేటర్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ, పూర్తిగా మూసివేతపై సమాలోచనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ ను వాయిదా వేస్తున్నారం. మంచి సమయం చూసి.. సినిమాను మీ ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం ప్రకటించింది. 

తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల జీవితాల్లోని ఉమ్మడి పాయింట్ ఆధారంగా ఆర్ ఆర్ ఆర్ ని తెరకెక్కించారు రాజమౌళీ. ఇందులో అల్లూరిగా రామ్ చరణ్, ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించారు. ఇక కొమరంభీమ్ గా ఎన్ టీఆర్, ఆయనకు జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటించారు. విజయ్ సేతుపతి, శ్రియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందించారు. దాదాపు రూ. 400కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మించారు.