ఎగిరిపోయాయ్.. తిరిగొస్తున్నాయ్ !

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోస్ం బాలీవుడ్ ప్రేమపక్షలు ఫ్లైట్ ఎక్కి ఎగిరిపోయాయి. నచ్చినోట వాలిపోయి.. మస్త్ గా ఎంజాయ్ చేశాయి. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రేమజంట రణ్ బీర్ కపూర్-అలియా భట్ ఆఫ్రికా వెళ్లింది.

న్యూ ఇయర్ ని అక్కడే సెలబ్రేట్ చేసుకుంది ఈ జంట. సెలబ్రేషన్స్ ముగించుకొని.. ఈ జంట సోమవారం తిరిగి ముంబైకి చేరుకుంది. విమానాశ్రయంలో దిగిన ఈ జంట కెమెరాకు చిక్కింది.

ఇప్పుడీ.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది పెళ్లిబంధంతో ఒక్కటి కాబోతుందని తెలుస్తున్నది.

మరోవైపు మరో బాలీవుడ్ ప్రేమజంట సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ రహస్య దీవిలో మస్త్ గా ఎంజాయ్ చేసింది.. ఈ జంట.

ఆ సెలబ్రేషన్స్ త్వరగానే ముగించుకున్న ఈ జంట ఆదివారం తిరిగి ముంబై చేరుకుంది. పోయిటప్పుడు ఎంత ఉత్సాహంగా కనిపించిందో ఈ జంట.. తిరిగొచ్చేటప్పుడు అంతకంటే డబుల్ ఉత్సాహంతో కనిపించింది.

ఈ రెండు జంటలే కాదు.. కెమెరా కంటపడకుండా.. బయటికి చెక్కేసిన జంటలు.. మెల్లిగా తిరిగి గూటికి చేరుకుంటున్నాయ్.